CS Reviews | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసును ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలని, వేదికను శుభ్రపరచడం, తాగునీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు.
ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధనశాఖ అధికారులకు సూచించారు. సమావేశానికి డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రెటరీలు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి, సెక్రెటరీ ఆర్అండ్బీ శ్రీనివాస్ రాజు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు.