వరంగల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్: ‘ఒక్క మహిళను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించాం అని రేవంత్రెడ్డి సర్కార్లోని ఆయన వర్గం సర్దిచెప్పుకోవచ్చు. కానీ, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు, ఆమె సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మా ప్రభుత్వం ఎంతోకాలం తప్పించుకోలేదు’ అని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఒకరు వ్యాఖ్యానించారు.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్ అనంతరం హైదరాబాద్లో మీడియా సమావేశంలో కొండా సురేఖ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ అధిష్ఠానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించడాన్ని కొండా సురేఖ స్వాగతించారు. ‘నా ఒక్కదాన్ని తప్పించి బదనాం కాకుండా ఉండేందుకు ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించాం’ అని చెప్పుకోవటానికే ఇదంతా చేశారని పేర్కొన్నారు. తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను దండించటం ఏంది? అంటూ అనేక ప్రశ్నలు సంధించారు. తప్పులను ఎత్తిచూపారు. రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సురేఖ లేవనెత్తిన అంశాలు..
సురేఖ సూటి ప్రశ్నలు..