ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 16:09:10

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట/మెదక్‌ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్‌లో చాలాసేపు ఉండాల్సి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.