నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది.
సోయా, పత్తి, వరి పంటలు అత్యధికంగా వరదల్లో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ భూముల్లో వరద నిలిచి ఉండడంతో పంట నష్టం వివరాల గణన ఇంకా కొనసాగుతూ ఉందని అధికారులు చెప్పారు.