హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): పంట నష్టం పరిహారంలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ శాఖ భారీగా కుదించింది. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ వాస్తవిక అంచనాలను 79,574 ఎకరాలకు తగ్గించింది. వీరికి మాత్రమే పంట నష్ట పరిహారం మంజూరు చేసిన ప్రభుత్వం.. బుధవారం రూ.79.57 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని గురువారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ పంట నష్టంపై మళ్లీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సవాలక్ష కొర్రీలు పెట్టినట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా 33% లేదా ఆ పైన పంట నష్టపోతేనే పంటనష్టం కింద పరిగణించారు. ఈ విధంగా 33%, ఆపై పంట నష్టం జరిగిన భూమి 79,574 ఎకరాలు మాత్రమేనని తేల్చారు. ఇందులో ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 28,407 ఎకరాలు, మహబూబ్నగర్లో 14,669 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 9,828 ఎకరాలు, మిగిలిన జిల్లాల్లో 3,288 ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చారు. ప్రాథమిక అంచనాలతో పోల్చితే వాస్తవ నష్టం ఏకంగా 3.45 లక్షల ఎకరాలు నష్టం తగ్గడం గమనార్హం. అసలు ఎక్కడైనా ప్రాథమిక అంచనాలకు, వాస్తవ అంచనాలకు ఇంత భారీ వ్యత్యాసం ఉంటుందా? అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాథమిక అంచనా