నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మురహరిదొడ్డి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో మొసలి కలకలం రేపింది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకొని మొసలిని బంధించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న అటవీ శాఖ అధికారులు దాన్ని కృష్ణానదిలో వదిలారు.
– కృష్ణ