నారాయణపేట : నారాయణ పేట ( Narayanapet ) జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కూసుమూర్తి గ్రామ శివారులోని బీమా నదిలో మొసలి( Crocodile) రైతును లాక్కెళ్లింది. నిన్నటి నుంచి నదిలో జాలర్లు వెతుకుతున్న ఇంకా జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు తిప్పన్న వరినారు మడి సిద్ధం చేసి మోటార్ ఆన్ చేశాడు.
ఫుట్బాల్ నుంచి నీరు మోటార్ కు రాకపోవడంతో ఫుట్బాల్లో ఏమైనా అడ్డు ఉందేమోనని చెత్త చేదారం తొలగించేందుకు, నదిలోకి దిగాడు. అక్కడే ఉన్న మొసలిని గమనించకపోవడంతో తిప్పన్నను పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న శివప్ప గౌడ వెంటనే గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లతో పాటు సమీప గ్రామాల్లోని జాలర్లతో సైతం గాలింపు చర్యలు మొదలు పెట్టినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
,