యాదాద్రి భువనగిరి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించేటప్పుడు వాహనంలోని మధ్య సీట్లో కూర్చోబెడతారు. కానీ, భువనగిరి పోలీసులు మాత్రం.. దాడిలో కీలకభూమిక పోషించిన నిందితుడు ఎన్ఎస్యూఐ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపంగ చందును ముందుసీట్లో కూర్చోబెట్టారు.
రేవంత్‌రెడ్డిని విమర్శించినందుకే బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి చేశామని సదరు వ్యక్తి వీడియో తీస్తూ హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రాత్రి 8 గంటలకే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలిసింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.