Media | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మీడియా విచక్షణ కోల్పోయింది. టీఆర్పీ రేటింగ్ కోసం రెచ్చిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల మాయలో పడి ఏది పడితే అది ప్రసారం చేస్తున్నద నే విమర్శలను నిజం చేసింది. మంత్రి కొండా సు రేఖ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ మీడి యా యథాతథంగా ప్రసారం చేసింది.
కొన్ని టీవీ చానళ్లు పోటీపడి బ్రేకింగ్ న్యూస్‌గా ప్రసారం చే శాయి. కొండా సురేఖ మహిళ అయితే.. సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్ మహిళలు కారా? ఒక సంచలనం కోసం మరో సంచలనాన్ని పావుగా వాడుకోవచ్చా? అన్న ఇంగితాన్ని మరచి మీడియా ప్రసారం చేసిం ది. ఏ విషయంలోనూ స్పందించని సినీ పరిశ్రమ ఈ విషయంలో స్పందించింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.