బతికి ఉన్న రైతును మరణించినట్టు చూపి..
ఓ రైతు బతికి ఉండగానే మరణించినట్టు తప్పుడు పత్రాలు పుట్టించి, అతడి పేరున ఉన్న పట్టా భూమిని అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది.
- పట్టా మార్పిడి కేసులో తహసీల్దార్‌పై వేటు
- భూభారతి ఆపరేటర్ క్రిమినల్ కేసు
- ‘నమస్తే’ కథనాలకు స్పందించిన కలెక్టర్
నాగర్‌కర్నూల్, జూలై 4 : ఓ రైతు బతికి ఉండగానే మరణించినట్టు తప్పుడు పత్రాలు పుట్టించి, అతడి పేరున ఉన్న పట్టా భూమిని అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇందుకు సంబంధించిన కథనాలు ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వరుసగా ప్రచురితం కావడంతో నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పందించి తహసీల్దార్‌ను సస్పెండ్ చేయగా, భూభారతి ఆపరేటర్‌ను తొలగించారు. వివరాలు ఇలా.. అచ్చంపేట మండలం హాజీపూర్‌కు చెందిన రైతు మశన్న జీవించి ఉండగానే మరణించినట్టుగా కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారు.
సదరు రైతుకు తెలియకుండానే ఆయన పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్పు చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొన్న సదరు రైతు ఫిర్యాదుచేయగా.. పూర్తిస్థాయిలో కలెక్టర్ విచారణ జరుపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బతికి ఉన్న రైతును చనిపోయినట్టుగా సృష్టించి పట్టా భూమి అసైన్డ్గా నమోదు చేయడానికి కారణమైన తహసీల్దార్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో పాత్రధారులైన భూభారతి ఆపరేటర్ జైపాల్‌ను తొలగిస్తూ, క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

