హైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ): ‘త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సిద్ధమవుతుంది’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని వర్గాలకు ఎన్నో హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు.