హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తేనున్న భూ వినియోగ చట్ట సవరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగు తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సవరణ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భూములను కేంద్ర బొగ్గుగనుల శాఖ ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చి.. ఆ భూమిలో మైనింగ్ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు.