హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ): సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మహాసభల్లో తొలిరోజు పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ హాజరుకానున్నారు. జాతీయ కా ర్యదర్శి బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారు. మహాసభల్లో రాష్ట్ర కొత్త కార్యదర్శిని ఎన్నుకునే అవకాశముంది.
రాష్ట్ర విభజన తర్వాత తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఓ నాయకుడు మూడుసార్లకు మించి రాష్ట్ర కార్యదర్శి గా పని చేయకూడదు. ఇప్పటికే తమ్మినేని మూడుసార్లు బాధ్యతలు నిర్వహించారు. కొత్త నాయకత్వ రేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీనియర్‌నేత ఎస్ వీరయ్య పేర్లు వినిపిస్తున్నాయి.