హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారుల మీద మరింత భారాన్ని మోపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రజా నిరసనలు, ఆందోళన ద్వారా కేంద్రంపై పోరాటానికి ముందుకు రావాలని ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.