సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 9 : విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకే కేంద్రంలోని మోదీ సర్కారు విద్యుత్తు చట్టసవరణకు కుట్ర పన్నుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యు డు బీవీ రాఘవులు ఆరోపించారు. చౌకగా ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తును కూడా ప్రైవేటీకరించాలనుకోవడం దారుణమన్నారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడి యాతో మాట్లాడారు.
విద్యుత్తు చట్ట సవరణ అందరికీ ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట సవరణ చేస్తే వ్యవసాయ రంగానికి ఉచి త విద్యుత్తు, ఎలాంటి విద్యుత్తు సబ్సిడీలు ఉండవని, పైగా వినియోగదారులపై భారం పడుతుందన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని విమర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా మహనీయుల ఆశయాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.