హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ): బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీ నాటి రోజుల కంటే దారుణంగా ఉన్నాయని అన్నారు. దివంగత సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.