హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ మూడోసారి గెలిస్తే భారత రాగ్యాంజాన్ని మార్చటం ఖాయ మని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ, పీఎం మోదీ, అమిత్ షా శత్రువులని దుయ్యబట్టారు.
విభజన హామీలు నెరవేర్చకుండా అటు తెలంగాణకు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇటు ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.