హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న నరేంద్రమోదీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాసమస్యలను పకదారి పట్టించేందుకే రాష్ట్రా ల్లో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ హటావో దేశ్ బచావో నినాదంతో చేపట్టిన ఇంటింటికీ సీపీఐ యాత్ర హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇందిరాపార్ వద్ద నిర్వహించిన ప్రారంభ బహిరంగ సభ లో నారాయణ మాట్లాడుతూ.. దేశం లో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేకపోతే పేదలకు ప్రభుత్వ భూములు దకకపోగా, ఆ భూములు కార్పొరేట్ వ్యా పారుల ఆధీనంలో ఉండేవని పేర్కొన్నారు. మోదీకి 30 మంది దత్త పుత్రు లు ఉన్నారని, వారిలో 29 మంది విదేశాలకు పారిపోయారని ఎద్దేవాచేశారు.
మరో దత్త పుత్రుడు అదానీకి దేశ సంపదను అప్పగిస్తున్నారని మోదీపై ధ్వజమెత్తారు. అదానీకి ఇచ్చిన రాయితీల్లో 10 శాతం ఖర్చు చేసినా పేదలకు ఇండ్లు, ప్రాజెక్ట్‌లు నిర్మించచ్చని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధాని ఉంటే దేశానికి న్యాయం ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని పరోక్షంగా బీజేపీ ప్రొత్సహిస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఏ మూలకు పోయినా కమ్యూనిస్టు కార్యకర్తలు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ గుర్తింపు ఎలా తొలగిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిలదీశారు.