చిగురుమామిడి, జూన్ 19: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నదని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని ‘రాంజీ’ పేరుగా మారుస్తూ 60 శాతం నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు, మెట్రో రైళ్లు, ఉకు ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లో ఏనాడూ గళం విప్పలేదని విమర్శించారు. మకల కొనుగోలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు ఎందుకు బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రశ్నించారు. వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.