హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్ఎస్ఎస్తో భారత రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హెచ్చరించారు. ఆదివా రం విజయవాడలో సీపీఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానంతరం మాట్లాడుతూ 19 రాష్ర్టాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఆందోళనకరమని చెప్పారు.
స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం క్రి యాశీలకంగా మారిందని తెలిపారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో జరుగనున్న ఎన్నికలను వామపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఎదుర్కొవాలని డీ రాజా పిలుపునిచ్చారు.