Narayana | హైదరాబాద్ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన నారాయణ వేదిక ఎక్కబోతుండగా.. కాలు జారిపడ్డారు. నొప్పిగా లేకపోవడంతో ఆయన పెద్దగా పట్టించుకోలేదు. వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రమంగా నొప్పి ఎక్కువ కావడంతో నారాయణ వైద్యుల్ని సంప్రదించారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని, రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.