హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): చెప్పులు మోసే బీజేపీ నాయకులా కమ్యూనిస్టులను విమర్శించేది అని సీపీఐ జా తీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ బతుకేందో ఇప్పుడు అర్థమైందంటూ మండిపడ్డారు. అమిత్ షా పెద్ద క్రిమినల్ అని, హత్యారోపణల కేసు లో 12 మంది సాక్షులను, లా యర్లను హత్య చే యించాడని విమర్శించారు. అలాంటి క్రిమినల్ చెప్పులు మోసే బీజేపీ నాయకులకు కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు లేదని సోమవారం ఓ వీడియో విడుదల చేశా రు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.