హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే వ్యక్తి అనే వైఖరి ఆర్ఎస్ఎస్ది అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని సూచించారు. జమిలి ప్రతిపాదనకు సీపీఐ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.