హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): ఇంటింటి సర్వేతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వ్యక్తిగత గో ప్యత పాటించాలని, వాటిని బహిర్గత పర్చాల్సిన అవసరం లేదని కోర్టులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. హై దరాబాద్‌లోని సీపీఐ కార్యాలయం లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే మంచి దే అయినా, కేవలం ఆ అంశాలకే పరిమితమవ్వాలని సూచించారు. కులగణన సందర్భంగా సేకరిస్తున్న సెల్‌నంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చి కితే ఇబ్బంది అవుతుందని అనుమా నం వ్యక్తంచేశారు. ఏ పార్టీ అని కూడా అడుగుతున్నారనే విషయం తమ దృ ష్టికి వచ్చిందని తెలిపారు. ప్రశ్నావళిలో అవసరం లేని వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు.