ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ షాక్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, తమతో సంప్రదింపులు జరుపకుండానే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించిందని సీపీఐ రాష్ట్ర నా యకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది.
- వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి
- నవంబర్ 5 తర్వాత అభ్యర్థి ప్రకటన!
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, తమతో సంప్రదింపులు జరుపకుండానే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించిందని సీపీఐ రాష్ట్ర నా యకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇటీవల జరిగిన సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగాలని సీపీఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఎం ప్లాయీస్ యూనియన్ విజయం సాధించిన నేపథ్యంలో .. పార్టీ అనుబంధ సంఘాల మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ భావిస్తున్నది.
సీపీఐ అభ్యర్థిగా జయసారథిరెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థా నం నుంచి సీపీఐ తరఫున గతంలో పోటీచేసిన జయసారథిరెడ్డి వైపే నా యకత్వం మొగ్గుచూపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీచేసేందుకు జయసారథి కూడా అంగీకరించినట్టు సమాచారం. అయితే, అభ్యర్థి పేరును అధికారికంగా నవంబర్ 5వ తేదీన ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం సీపీఐ మద్దతు కొనసాగేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సీపీఐ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. రాష్ట్ర కమిటీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కుదరకపోతే, జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపాలని కాంగ్రెస్ యో చిస్తున్నది. ఇదే జరిగితే చర్చల సందర్భంగా తమకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుపట్టే అవకాశం ఉన్నదని సీపీఐ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

