సంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. మంగళవా రం ఆయన సంగారెడ్డిలో విలేకరుల స మావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మారి న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు.
ఎమ్మెల్యేలు పార్టీ మార డం వారిని గెలిపించిన ఓటర్లను అవమానించడమేనని పేర్కొన్నారు. ఏ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యే ఆ పార్టీలోనే ఉండాలని, పార్టీలు ఫిరాయించటం సరికాదని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణ యం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులు కేటాయించలేదని, రైల్వేబడ్జెట్లోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.