హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : టీవీలో ప్రసారమవుతున్న బిగ్బాస్ షోను నిషేధించాలని కొన్నేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ షోను అంతమొందించేందుకే తాను ఫైట్ చేస్తున్నానని తెలిపారు. పెళ్లికాని యువతీయువకులను ఒక రూంలో పెట్టి మూడు నెలలు ఉంచడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
షోషల్ బిహేవియర్ పేరుతో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ఈ షోను నిషేధించాలని కోర్టులో కేసు వేశానని చెప్పారు. నోటీసులు ఇస్తే నాగార్జున పారిపోయాడని, బిగ్బాస్ టీం తీసుకుందని అన్నారు. మళ్లీ నాగార్జునకు త్వరలోనే నోటీసులు వెళ్తాయని, కోర్టులోనే బిగ్బాస్ విషయం తేలుస్తానని నారాయణ స్పష్టం చేశారు.