కొత్తగూడెం సింగరేణి, జూలై 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ జితేశ్ వీపాటిల్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేస్తుండగా కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు వేదికపైకి రాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలుగజేసుకొని ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అని, కాంగ్రెస్ నాయకులు దిగివెళ్లాలని సూచించారు. మాజీ కౌన్సిలర్ వై శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడగా అక్కడే ఉన్న సీపీఐ నాయకులు కలుగజేసుకొని గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు, మెల్లగా మాట్లాడాలని హెచ్చరించారు.