హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సీపీగెట్ రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండో విడత రిజిస్ట్రేషన్లు శనివారం నుంచి ప్రారంభంకానుండగా, అభ్యర్థులు 27 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.
అక్టోబర్ 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు, 5న ఎడిట్ చేసుకోవచ్చు. 9న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 17 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది.
డిసెంబర్ 15కు సీటెట్ వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 1న ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్షను డిసెంబర్ 15న నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. అభ్యర్థులు అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.