CPGET 2025 | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2025లో భాగంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. 28వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 28వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 30వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక సీట్ల కేటాయింపు జాబితాను వచ్చే నెల 1వ తేదీన విడుదల చేస్తామని, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో 3వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. 5వ తేదీ నుంచి రెండవ దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.