హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) రాత పరీక్షలను జూలై 6 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మె స్సీ, వంటి 45 సబ్జెక్టుల్లో యూనివర్సిటీల్లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. రోజుకు మూడు సెషన్లలో ఆన్లైన్లో నిర్వహిస్తామని పే ర్కొన్నారు. జూలై 3 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.osmania.ac.in, https://cpget.tsche.ac.in, www.ouadmissions.com వెబ్సైట్లను సంప్రదించాలని కోరారు.