హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు సవరించారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన రిజిస్ట్రేషన్ గడువు శుక్రవారం ముగియగా, తాజాగా సవరించిన షెడ్యూల్ను సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి విడుదల చేశారు.
29న సీట్లను కేటాయించనుండగా, సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. పీజీ కోర్సుల మొదటి సంవత్సరం తరగతులు అక్టోబర్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,231 పీజీ కాలేజీలుండగా, వీటిల్లో 44,756 సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీచేస్తారు.