హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 4,5 తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. 12 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 10,841మంది దరఖాస్తు చేసుకున్నారు. 9,218 మంది(88.03%) హాజరయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారని పేర్కొన్నారు. ర్యాంకు కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.