తెలంగాణ.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఖరారు
కరోనా చికిత్స | కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో

హైదరాబాద్ : కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ట ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్స ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలుగా ఖరారు చేశారు. పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదని తెలిపింది. హెచ్ఆర్సీటీ – రూ. 1995, డిజిటల్ ఎక్స్‌రే – రూ. 1300, ఐఎల్6 – రూ. 1300, డీ డైమర్ పరీక్ష – రూ. 300, సీఆర్పీ – రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400, ఫెరిటిన్ – రూ. 400, ఎల్ డీహెచ్ – రూ. 140గా ఖరారు చేశారు. సాధారణ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీటర్‌కు రూ. 75, ఆక్సిజన్ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్‌కు రూ. 125గా ఖరారు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

