హైదరాబాద్ : నగరంలోని వెంగళ్రావు నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కమాండ్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం ఎంత శ్రమిస్తే.. యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తాము అని కేటీఆర్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. ఈ కొవిడ్ కమాండ్ సెంటర్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్‌ను, కరోనా ఇతర సమస్యలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు.
Minister @KTRTRS inaugurated the Telangana State’s Covid Command Center at the Indian Institute of Health and Family Welfare (IIHFW) in Hyderabad. Telangana Govt. is building the health infrastructure and is taking strategic steps to be prepared for a potential 3rd wave. pic.twitter.com/BNhfnkoOWd
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 25, 2021