హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): బడులు ప్రారంభమయ్యాయి. దేశంలో కొవిడ్ కేసులు కూడా పెరగటం మొదలయ్యాయి. దీంతో పిల్లలకు ఏమవుతుందోనని తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అయితే, మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 12 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు కొవిడ్ వచ్చే చాన్స్ చాలా తక్కువ అని తెలిపారు. ఐదేండ్లలోపు పిల్లల్లో అయితే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కాకపోతే పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సూచనలివీ