నాంపల్లి కోర్టులు, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణ కొనసాగించేందుకు పంజాగుట్ట పోలీసులకు అనుమతిస్తూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత పూర్తి స్థాయి విచారణ కోసం అనుమతి కోరుతూ అధికారు లు పిటిషన్ వేశారు. విచారణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని పీపీ కోర్టుకు తెలిపారు. పీపీ వాదనల ప్రకారం కోర్టు అనుమతి జారీ చేసింది. మరోసారి అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.