వినాయక్‌నగర్, జూలై 18: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన భీమ్‌గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో గురువారం జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక పోలీసులు మాజీ ఎంపీపీ మహేశ్‌పై అక్రమంగా హత్యాయత్నం కేసుపెట్టి అరెస్టు చేశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ మధుసూదన్‌రావు నేతృత్వంలోని బృందం అర్ధరాత్రి స్థానిక కోర్టును ఆశ్రయించింది.
హోర్డింగ్ పెట్టినందుకు..
కంటోన్మెంట్, జూలై 18: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ టు జెడ్ స్కాములను ప్రశ్నిస్తూ హోర్డింగ్ పెట్టినందుకు కంటోన్మెంట్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాయికిరణ్‌ను పోలీసులు తన ఇంటి నుంచి తీసుకెళ్లారు. 24 గంటలు దాటినా సాయికిరణ్ ఎక్కడున్నాడనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు సైతం పోలీసులు వెల్లడించలేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ రంగంలోకి సాయికిరణ్ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులను సంప్రదిస్తున్నా ఆచూకీ చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.