బాన్సువాడ/ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 1: న్యాయవ్యవస్థలో న్యాయ ప్రాంగణం కక్షిదారులకు దేవాలయమని హైకోర్టు న్యా యమూర్తులు జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి పేర్కొన్నా రు. తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తున్నామనే భావన వదిలి, స మస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవడానికి, చట్టపరంగా హక్కును పొందడానికే కోర్టుకు వస్తున్నారన్న భావన ఉండాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, ఎల్లారెడ్డిలో నిర్మించనున్న కోర్టు భవనాలకు హైకోర్టు న్యాయమూర్తులు శనివారం శంకుస్థాపనచేసి మాట్లాడారు. లోక్అదాలత్లో ఇరుపార్టీల సమ్మతి ఉంటేనే పరిష్కరించాలని, ఏ ఒక్క రూ సమ్మతిగా లేకపోయినా కోర్టు ద్వారానే పరిష్కరించాలని లాయర్లకు సూచించారు. హైదరాబాద్లో 1918లో నిర్మించిన హై కోర్టు భవన నిర్మాణానికి, ఎల్లారెడ్డిలో 19 36లో నిర్మించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి చాలా పోలికలు ఉన్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి టీఎస్పీ భార్గవి, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.