హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగా ణ): రాష్ట్ర పోలీస్‌శాఖలోకి అడుగుపెట్టబోతున్న నూతన ఎస్సైలకు సెప్టెంబర్ మూడో వారంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్‌శాఖ సన్నద్ధమవుతున్నది. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైనది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఎస్సై అభ్యర్థుల ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్.. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విస్తృతంగా కొనసాగుతున్నది. త్వరలోనే ఈ వెరిఫికేషన్ పూర్తికానున్నది. మండలాల వారీగా ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల వివరాలు స్థానిక పోలీస్స్టేషన్లకు చేరాయి. దీంతో అక్కడ ఆ అభ్యర్థి నేర చరిత్ర, ప్రవర్తన, గుణగణాలు ఇతర విషయాలపై కూలంకషంగా ఆరా తీస్తున్నారు.
ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 587 ఎస్సై పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. వీరి లో అగ్నిమాపకశాఖ, జైళ్ల విభాగాలను మినహాయించి మొత్తం 550 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీ సిద్ధంగా ఉన్నది. సివిల్ అభ్యర్థులకు 12 నెలలు, ఏఆర్ అభ్యర్థులకు 10 నెలలు, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు 9 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు, మెస్ వసతి ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది కూడా 16 సబ్జెక్టులు, రెండు సెమిస్టర్లుగా శిక్షణకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అయితే, మహిళలు, చిన్నారుల భద్రత, లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో చేసిన భారతీయ సంహిత, భారతీయ నాగరిక్ సంహిత, భారతీ య సాక్ష్య (బీఎస్)-2023 వంటి కొత్త చట్టాలతోపాటు వ్యక్తిగత డాటా మేనేజ్మెంట్పై చేసి న కొన్ని చట్టాల ఆధారంగా కొత్త సబ్జెక్టులు పెరి గే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.