నాంపల్లి అగ్నిప్రమాదంపై కౌంటర్‌కు ఆదేశం
నాంపల్లిలోని బజార్‌ఘాట్ అగ్ని ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అగ్ని ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను వివరించాలని కోరింది. బ
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని బజార్‌ఘాట్ అగ్ని ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అగ్ని ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను వివరించాలని కోరింది. బజార్‌ఘాట్‌లో అగ్ని ప్రమాదఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టుకు ఒక లేఖ వచ్చింది. దీనిని సుమోటో పిల్‌గా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, అగ్నిమాపక డీజీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, జోనల్ కమిషనర్, నాంపల్లి ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. బజార్‌ఘాట్‌లో నవంబర్ 13న జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

