హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 9న విచారణకు హాజరు కావాలని జనవరి 6న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూ నిట్ డీఎస్పీ తనకు నోటీసులు జారీచేశారని, ఆ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరడంతో పోలీసులు నిరాకరించారని పేర్కొన్నారు. దీంతో ఆ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం పోలీసులను ఆదేశించారు. విచారణను 21కి వాయిదా వేశారు.