వ్యవసాయ యూనివర్సిటీ : వ్యవసాయ, అనుబంధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి 23 వరకు రాజేంద్రనగర్ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ విద్యాసాగర్ ప్రకటనలో తెలిపారు. అగ్రి వర్సిటీతోపాటు పీవీ నర్సంహరావు, కొండాలక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కోర్సులకు తొలి దశ సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ(అగ్రికల్చరల్), బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా 15% అమలుచేస్తున్నట్టు తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www. pjtau. edu. inను సంప్రదించాలని సూచించారు.