హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, వెస్ట్రన్ సిడ్నీ(ఆస్ట్రేలియా)యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తుంచనున్నట్టు అగ్రికల్చర్ వర్సిటీ రిజిస్ట్రార్ జీఈసీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. రాజేంద్రనగర్లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.pjtau.edu.in చూడాలని చెప్పారు.
20 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం షెడ్యూల్ ఖరారుచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 18న జారీ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ 20న ప్రారంభమై సెప్టెంబర్ 5న ముగియనుండగా, సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 8న ప్రారంభమై 16న ముగియనున్నది. పూర్తివివరాలను ఐసెట్ అధికారిక వెబ్సైట్లో ఉంచనున్నారు.