హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): విజయవాడ, హైదరాబాద్‌లోని కేఎల్వర్సిటీ క్యాంపస్‌ల్లో ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26నుంచి 30వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ వెల్లడించారు. కేఎల్ వర్సిటీ జాతీయస్థాయిలో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు జేఈఈ పర్సెంటైల్, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన కోర్సులు ఎంచుకోవచ్చని తెలిపారు.