నల్లగొండ : నిన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో కలిసి క్రాంతి స్వగ్రామం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో క్రాంతి కిరణ్ రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి- అరుణను పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతూ ఓదార్చారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహం తరలింపునకు చేపట్టిన చర్యలపై హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా వచ్చేలా చూస్తామని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.