ఖమ్మం వ్యవసాయం/పెద్దపల్లి జంక్షన్/గజ్వేల్, డిసెంబర్ 31: అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కారణంగా పత్తి ధరలు రికార్డులు సృష్టిస్తున్నా యి. గత కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మద్దతును మించి ధరలు దక్కుతున్నాయి. ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఖరీదుదారులు పోటీపడంతో రికార్డు స్థాయికి చేరుతున్నాయి. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.9,300 పలికింది. మధ్యస్త ధర రూ.9 వేలు, కనిష్ఠ ధర రూ.7,700 చొప్పున పలికింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్నమొన్నటి దాకా రూ.8,800కుపైగా పలికిన పత్తి శుక్రవారం రూ. 9,031కు ఎగబాకింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాల్ పత్తికి శుక్రవారం అత్యధికంగా రూ.9,033 ధర పలికింది.