పత్తిరైతు.. అథోగతి
రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సరైన మద్దతు ధర రాక.. విధిలేక ప్రైవేట్ వ్యాపారులకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది. జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోలు కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేసి వారం గడుస్తున్నా ఒక్క రైతు కూడా స్లాట్ బుక్ చేసుకోలేదు. సర్కార్ కేంద్రాల్లో 8 నుంచి 10 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించారు.
- సర్కార్ కేంద్రాల్లో మద్దతు ధర కరువు
- స్లాట్ బుకింగ్‌కు ముందుకు రాని రైతులు
- వెలవెలబోతున్న కొనుగోలు సెంటర్లు
- విధిలేక ప్రైవేట్‌కు అమ్ముకొంటున్న దుస్థితి
రంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సరైన మద్దతు ధర రాక.. విధిలేక ప్రైవేట్ వ్యాపారులకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది. జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోలు కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేసి వారం గడుస్తున్నా ఒక్క రైతు కూడా స్లాట్ బుక్ చేసుకోలేదు. సర్కార్ కేంద్రాల్లో 8 నుంచి 10 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించారు. 10 శాతం కంటే పైబడి ఉన్న పత్తికి రూ.8,500 మాత్రమే నిర్ణయించారు. బయట మార్కెట్లో 8 శాతం నుంచి 10 శాతం తేమ ఉన్న పత్తికి రూ.9 వేలు ఇస్తుండటంతో రైతులు బయట మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం బయట మార్కెట్ ధరలకు కూడా కొనుగోలు చేయడం లేదని, ఈ సంవత్సరం కనీస గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో అత్యధిక సాగు
రంగారెడ్డి జిల్లాలో రైతాంగం అత్యధిక శాతం పత్తి సాగు చేస్తున్నది. సీజన్లో దిగుబడి అధికంగా వస్తుందని, అందుకు తగ్గట్టు ధరలు కూడా ఉంటాయని భావించిన రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు. జిల్లాలో అత్యధికంగా పత్తి పండించే మండలాల్లో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, యాచారం, కడ్తాల్, షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చేవెళ్ల, షాబాద్ ఉన్నాయి. ఈ సీజన్లో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, మద్దతు ధర సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక రైతులు దళారులను ఆశ్రయించడంతో తేమశాతం, తూకాల్లో మోసాలతో నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొర్రీలు లేకుండా మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

