నిబంధనలకు పాతర
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో రాంకీ సంస్థ నిబంధనలకు పాతర వేస్తున్నది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా టన్నుల కొద్ద్ది చెత్తను కాల్చివేస్తున్నారు.
-
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో రాంకీ నిర్లక్ష్యం
-
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కాల్చివేత
-
రోగాలబారిన పడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు
-
యార్డ్‌ను ఎత్తివేయాలని 18 నుంచి రిలే నిరాహార దీక్షలు
మేడ్చల్, నవంబర్10 (నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో రాంకీ సంస్థ నిబంధనలకు పాతర వేస్తున్నది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా టన్నుల కొద్ద్ది చెత్తను కాల్చివేస్తున్నారు. దీంతో దుర్వాసనతో పాటు విషపూరిత పొగ వెలువడటంతో చుట్టుపక్కల ప్రాంతాలైన జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారంలో నివసించే లక్షలాది ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. వాస్తవానికి డంపింగ్ యార్డ్‌కు వచ్చే చెత్తను శాస్త్రీయంగా వేర్వురుగా చేసి తడిచెత్తతో ఎరువు, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్ది వచ్చిన చెత్తను యార్డులోనే కాల్చివేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం..?
రాంకీ సంస్థ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కాల్చివేసి పర్యావరణంతో పాటు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నరాని డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, ఎంఎంసీ, పర్యావరణ శాఖ అధికారులు ఇక్కడ ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త కాల్చివేతను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే డంపింగ్ యార్డ్ నిర్వహణపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
18 నుంచి రిలే నిరాహార దీక్షలు..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పూర్తి స్థాయిలో తొలగించే వరకు అఖిలపక్షం కమిటీ నేతృత్వంలో ఈనెల 18 నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టానున్నారు. అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసుకున్న అఖిలపక్ష కమిటీ సభ్యులు డంపింగ్ యార్డ్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పలుమార్లు విన్నవించినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. వారంతా నిరాహార దీక్షకు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి డంపింగ్ యార్డ్ తొలగించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు. రాంకీ సంస్థపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.వచ్చే చెత్తను శాస్త్రీయంగా వేర్వురుగా చేసి తడిచెత్తతో ఎరువు, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్ది వచ్చిన చెత్తను యార్డులోనే కాల్చివేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

