తెలంగాణపై చలి పంజా!
తెలంగాణపై చలి పంజా విసురుతున్నది. రానున్న 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండనున్నది. మధ్యాహ్న వేళ మినహా మిగతా సమయమంతా చలి ఉంటుంది. జోగుళాంబ-గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
- రానున్న 3 రోజులు మరింత చలి
- ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై చలి పంజా విసురుతున్నది. రానున్న 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండనున్నది. మధ్యాహ్న వేళ మినహా మిగతా సమయమంతా చలి ఉంటుంది. జోగుళాంబ-గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.సంగారెడ్డి, మెదక్, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశమున్నదని తెలిపింది.
తెల్లవారుజామున పొగమంచు కూడా కమ్ముకునే అవకాశమున్నదని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది. మరోవైపు మంగళవారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.1 డిగ్రీలుగా రికార్డు అయ్యింది. ఈశాన్య దిశ నుంచి తకువ ఎత్తులో గాలులు వీస్తుండటమే రాష్ట్రంలో చలి పెరుగడానికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

